ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్ఢి చెప్పారు.
‘గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారరం ఆయన పురపాలక సంఘం పరిధిలోని 15వ వార్డులో పర్యటించారు.
అక్కడ ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పక్కా గృహాలు, తాగునీరు, రోడ్లు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం బియ్యపు మధు మాట్లాడుతూ… శ్రీకాళహస్తి వాసులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి తాను, తన కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి అన్ని వేళలా అందుబాటులో ఉంటామన్నారు.
15వ వార్డు పరిధిలోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.
.