తెలుగు పాటకు సొబగులు అద్ది, తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన పాటల పూదోట, సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సంస్మరణ సభ శ్రీకాళహస్తిలో నేడు జరగనుంది.
06 డిసెంబర్ 2021 సోమవారం పట్టణంలోని సాయంత్రం 4 గంటలకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు.
అభ్యుదయ రచయితల సంఘం (అరసం), ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధ్యక్ష, కార్యదర్శులు లగడపాటి భాస్కర్, యువశ్రీ మురళి లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సమావేశానికి సాహితీ వేత్తలు చీకోలు సుందరయ్య, సాకం నాగరాజ, రంగస్థల కళాకారుడు బొందు రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొంటారు.
సాహితీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయగలరన్నారు.
.