విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల సాధనే పరిష్కారంగా 75 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగిన సంఘం ఎస్టీయూ అని జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఆదివారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ వజ్రోత్సవ వేడుకలు మరియు డివిజన్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ సంఘ సంఘటితం కోసం కలసి పనిచేసి సంఘాన్ని అభివృద్ది చేయాలని,పీ.ఆర్.సి.డి.ఏ లు తక్షణం ప్రకటించాలన్నారు.
ఈ సందర్భంగా 5 మండలాలు ఎన్నికల ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.
కార్యక్రమంలో..ఎస్టీయూ నాయకులు లోకనాదరెడ్డి,గంటా మోహన్,మోహన్ రెడ్డి,యువశ్రీ మురళి,సుధాకర్,కృష్ణయ్య, గుమ్మడి మురళి,హరికృష్ణ, జయప్రకాష్,కన్నయ్య,చేమూరు రవి, రమణారెడ్డి,మహేశ్వర రెడ్డి, అమరనాథ్, లక్ష్మయ్య, కోమల పలు మండలాల నుండి ఎస్టీయూ కార్యకర్తలు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
.