రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజా ప్రతినిధులు మానవతా దృక్పథంతో సహకరించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కోరారు.
బుధవారం పాదయాత్రకు సంఘీభావం తెలియజేసిన ఆయన శ్రీకాళహస్తి వద్ద మీడియాతో మాట్లాడారు. వరదల సందర్భంగా తాను రాయలసీమ కట్ట చెరువు పరిశీలనకు వెళ్లినప్పుడు కాలికి గాయమైతే వైసిపి ఎంపి డాక్టర్ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దగ్గరుండి ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి మానవతా దృక్పథంతో తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు 37 రోజులుగా అమరావతి నుండి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.
అనేక శారీరక ఇబ్బందులకు గురై మొక్కవోని దీక్షతో పాదయాత్రలో నడుస్తున్నారని అన్నారు.
అటువంటి పాదయాత్రకు వైసిపి నాయకులు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో సహకరించాలని కోరారు.
తనకు ఓ వైపు కాలి గాయం నొప్పి ఉన్నప్పటికీ వారి పాదయాత్రలో వారి కష్టాలకంటే నొప్పి ఎక్కువ కాదని రావడం జరిగిందని చెప్పారు. కావున పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు.
.