అమరావతి రైతుల న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు మహాపాదయాత్రకు దగ్గర నుండి వారికి కావలసిన సహాయ సహకారాలను అందించడం జరిగిందని తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు ప్రకాష్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు.
అమరావతి రైతుల మహాపాదయాత్ర 45 వరోజు ముగింపు సందర్భంగా అలిపిరి వద్ద రైతులు,రైతు నాయకులు,జేఏసీ నాయకులతో పాటు తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మోకాళ్ళ మీద కూర్చుని నిరసన తెలియజేశారు.
అమరావతినే రాజధానిగా కోన సాగించాలని పాలకుల మనసు మార్చు తండ్రి అని సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగినది.
.