తెలుగు సినిమా పాటకు సొబగులు అద్ది, తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన పాటల పూదోట సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సంస్మరణ సభ సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో.. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) -చిత్తూరుజిల్లా శాఖ మరియు ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహితీవేత్త చీకోలు సుందరయ్య హాజరై నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అంటూ ప్రజల్ని చైతన్య పరచిన సిరివెన్నెల వలపు, తలపు గీతాలకే పరిమితం కాక తన సర్వశక్తులను సమాజ వికాసానికి వినియోగించుకున్నారన్నారు.
అరసం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు సాకం నాగరాజ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ ఒక సాహితీ పాటల దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు.
తెలుగు పాటకు సొబగులు అద్ది, తెలుగు సినిమా సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన ఆయన మనందరం పాడుకునే పాటల్లో చిరస్మరణీయులుగా ఉన్నారన్నారు.
ప్రముఖ రంగస్థల కళాకారులు,గాయకులు బొందు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి ఆణిముత్యం సిరివెన్నెల పాటలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత లగడపాటి భాస్కర్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు కత్తి రాజేశ్వరి, ప్రముఖ కథారచయిత పేరూరు బాలసుబ్రమణ్యం, అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి యువశ్రీ మురళి, ఒబ్బు దేవి ప్రసాద్, తీగల వెంకటయ్య, గురునాధం, మునిసుబ్బారెడ్డి, కృష్ణయ్య, చేమూరు రవి, భాస్కర్, శ్రీరామమూర్తి, రవీంద్ర, సరోజ, ఇందిర, మంగీలాల్,, గోవిందయ్య, భాస్కర్, మయూర, తులసీదాస్ పలువురు సాహితీ అభిమానులు పాల్గొని సిరివెన్నెల ని స్మరించుకున్నారు.
.