రవితేజతో తాజాగా రూపొందుతున్న ‘క్రాక్’ చిత్రం విడుదలకు గండం ఏర్పడింది. నిర్మాత టాగూర్ మధు.. గతంలో తమిళంలో తీసిన చిత్రానికి సంబంధించి ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మద్రాసు హైకోర్టులోు పిటిషన్ వేయడంతో ఇబ్బంది తప్పేలా లేదు.
క్రాక్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే తమిళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ పని జరగనిస్తుందో లేదో తెలియదు.
దీని నిర్మాత ఠాగూర్ మధు గతంలో తమిళంలో అయోగ్య చిత్రాన్ని విశాల్ తో తీశారు. ఇది బాక్సాఫీసు వద్ద ఢమాల్ అంది. అయితే స్క్రీన్ సీన్ మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయోగ్య డిస్ట్రిబ్యూటర్లకు ఈ నిర్మాత చెల్లించాల్సిన బకాయిల్ని పూర్తిగా చెల్లించే వరకు క్రాక్ చిత్రం విడుదలను నిలిపేయాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది.
ఇప్పటికే తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జీటీవీ గ్రూపు కొనాలని అనుకున్నప్పటికీ వెనక్కు తగ్గింది. ఇప్పుడు ఈ పిటిషన్ తో మరిన్ని చిక్కులు వచ్చినట్టే.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక.
.