తిరుపతి ఎంపీగా ఉంటూ మరణించిన బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి కాకుండా.. మరొకరికి టికెట్ ఇస్తే గనుక.. అది తెలుగుదేశానికి ఎడ్వాంటేజీ అవుతుందా? రాజకీయవర్గాల్లో ఇప్పుడు అలాంటి చర్చ కూడా నడుస్తోంది. తెలుగుదేశం అధినే చంద్రబాబునాయుడు తన అలవాటుకు భిన్నంగా.. ఈసారి తిరుపతి ఎంపీ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ముందుగానే ప్రకటించేశారు. ఇక్కడ బీజేపీ కూడా మేం పోటీచేసి తీరుతాం.. నెగ్గితీరుతాం అని ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లోనే ఇక్కడ పోటీచేసే పరిస్థితి లేక నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా బీఎస్పీ చేతుల్లో పెట్టిన జనసేన ఈసారి బీజేపీకి మద్దతివ్వడం తప్ప మరో పరిణామం జరగకపోవచ్చు. పార్టీలన్నీ క్లియర్ గానే ఉన్నాయి. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయం మలుపు తిరిగింది.
బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం వచ్చిన ఖాళీ కావడంతో వారి కుటుంబానికే టికెట్ ఇస్తారని అంతా భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర చేస్తున్న రోజుల్లో తనకు ఫిజియో థెరపిస్టుగా పనిచేసిన గురుమూర్తికి టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. వైసీపీ ఎంపీల్లో చాలా మంది యువకులునున్నారు. ఇప్పుడు ఎంపిక చేసిన గురుమూర్తి వయసు కూడా కేవలం 27 ఏళ్లే కావడం విశేషం. తిరుపతి ఎంపీ పరిధిలోకి వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాల నాయకుల్ని పిలిచి గురుమూర్తి విజయం కోసం పనిచేయాల్సిందిగా సూచనలు కూడా ఇచ్చేశారు.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి : తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా? పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా? ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వడం అనేది తమకు ఎడ్వాంటేజీగా మారుతుందని తెలుగుదేశం భావిస్తోంది. సిటింగ్ ఎంపీగా మరణించడం వల్ల ఆయన కుటుంబానికి సానుభూతి ఉండేదని.. ఇప్పుడు అది కూడా లేకుండా కొత్త అభ్యర్థి తెరమీదకు రావడం వల్ల ప్రజల్లో పార్టీ పరంగా ఉండేదే తప్ప, అభ్యర్థి పరంగా ఎలాంటి ఎడ్వాంటేజీ ఉండదని వారు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనిది చాలా ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి సానుభూతి పనిచేస్తుందని వారు ఆశిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే పరిచయాలు కూడా లాభిస్తాయనేది వారి అంచనా. ఆ రకంగా బల్లి కుటుంబానికి టికెట్ రాకపోతే.. తాము లాభపడతామని తెలుగుదేశం భావిస్తోంది.
ఇదీ చదవండి : కేడర్ పోటీచేయాలనుకున్నా.. జగన్ వద్దన్నారు ఎందుకు?