హీరోలు రెండు షిఫ్ట్ లలో షూటింగ్ చేయడం అనేది.. పూర్తిగా పురాతన తరం మాట. ఈ రోజుల్లో ఒక సినిమా చేసిన తర్వాత.. హీరోలు ఓ ఏడాది గ్యాప్ తీసుకుని ఎంజాయ్ చేసిన తర్వాతే.. మళ్లీ సెట్లో అడుగు పెడుతున్నారు. షూటింగ్ ఉన్న రోజుల్లో కూడా సాయంత్రం ఆరు గంటలకెల్లా పేకప్ చెప్పేసి.. ఆతర్వాతి సమయాన్ని ఎలా ఎంజాయ్ చేయాలా? అని ప్లాన్ చేసుకుంటున్న వాళ్లే ఉన్నారు. అలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాత్రం.. ఒకవైపు షూటింగులతో ఎంత బిజీగా ఉన్న.. తన జనసేన పార్టీకోసం.. రాజకీయ వ్యవహారాలకోసం తగినంత టైం కేటాయిస్తున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు హాట్ గా ఉన్న నేపథ్యంలో.. వాటిమీద నుంచి దృష్టి మరల్చకుండా.. ఫాలో అవుతున్నారు. షూటింగ్, ఇతర పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అంతే పద్ధతిగా.. పొలిటికల్ మీటింగులు పెట్టుకుంటూ.. పార్టీని ఎన్నికల సమరంలోకి సమాయత్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాలు రెండు షూటింగులో ఉన్నాయి. ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో ఎఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం వేగంగా షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార్ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం కూడా షూటింగ్ అవుతోంది. ఒకేరోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్రిష్ సినిమా షూట్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్ లంచ్ తర్వాత.. సాగర్ చంద్ర దర్శకత్వంలో షూట్ లో సాయంత్రం దాకా పాల్గొన్నారు. ఈ మధ్యలోనే షూటింగ్ స్పాట్ లోనే.. పార్టీ శ్రేణులతో మీటింగ్ పెట్టుకుంటున్నారు.
రాజకీయ పరిణామాల గురించి.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండడానికి లొకేషన్ వద్దనే తన సెక్రటేరియేట్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లో అలుపెరగని పరిశ్రమ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. రాజకీయ పరిణామాల మీద నుంచి దృష్టి మరల్చడం లేదు. ఒకవైపు షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ.. రాజకీయ అంశాలు తన దృష్టినుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన ఈ పరిణామాలపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టారు.
ఇవి కూడా చదవండి
ఓవరాక్షన్ మాని.. వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ!
జనసేనానిని చూసి ఇతర పార్టీలు ఎందుకు భయపడుతున్నాయంటే?
వకీల్ సాబ్ సాంగ్ లో మహాత్మాగాంధీ ఫిలాసఫీ
పవన్ కల్యాణ్ లోని సంస్కారానికి ఇది మచ్చుతునక!
రాష్ట్రపతి ఆదేశించినా.. ఇంకా వేధింపులేనా?
షూటింగుల్లో ఉండే సమయంలో.. తనకు సహాయకులుగా ఉండే సిబ్బందిని వెంట ఉంచుకుంటున్నారు. రాజకీయ డెవలప్మెంట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అలాగే జిల్లాలనుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో సైతం షూటింగ్ లొకేషన్ల వద్దనే విడిగా మీటింగులు పెట్టుకుంటూ వారు దిశానిర్దేశం చేస్తున్నారు. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చాలా కీలకం కావడంతో.. అక్కడి పార్టీ శ్రేణులతో కూడా.. లొకేషన్లోనే మీటింగ్ పెట్టుకుని దిశానిర్దేశం చేశారు.
ఒకవైపు షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరోవైపు రాజకీయ వ్యవహారాలు చేజారిపోకుండా ఆయన శ్రద్ధ పెడుతున్నారు. అసలే పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ప్రోత్సాహకరమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో పార్టీ గుర్తుల మీద జరిగే మునిసిపల్ ఎన్నికల్లో మరింత ఫోకస్ పెంచితే.. పార్టీకి ప్రజల్లో మైలేజీ పెరుగుతుందని పవన్ కల్యాణ్ అవిశ్రాంతంగా పనిచేస్తూ.. పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Discussion about this post