తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు ప్రత్యమ్నాయ చర్యల తీసుకొని తగినంత మంది సిబ్బందితో వెంటనే సేవలు పునరుద్ధరించాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశించారు. తి
రుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం అదనపు ఈవో టిటిడి అధికారులు, ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు టిటిడి కార్పోరేషన్‌లో కలపాలని కోరుతూ తిరుమల, తిరుపతిలలో విధులకు హాజరు కాకుండా ధర్నా నిర్వహిస్తున్నారన్నారు. ఈ కారణంగా శ్రీవారి భక్తులకు తిరుమల, తిరుపతిల్లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
రాబోవు రెండు మూడు రోజుల్లో అన్ని ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు కొత్తవారితో ఖాళీలను భర్తీ చేసి భక్తులకు పూర్తి స్థాయిలో సేవలందించాలని ఆదేశించారు. సేవలందించని ఏజెన్సీలపై శాఖా పరమైన చర్యలు తీసుకొని, కొత్త ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు.
ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు స్పందిచని ఎడల తిరుమల, తిరుపతిలలో భక్తులకు సేవలందించేందుకు టిటిడికి అవసరమైన పారిశుద్ధ్య కార్మికులను ఆరోగ్య విభాగం ద్వారా నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్ఇ- 2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీదేవి, ఎఫ్ఎమ్ఎస్ ఇఇ రవి శంకర్ రెడ్డి, వసతి విభాగం డెప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, వివిధ ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.
Discussion about this post