టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా జిఎన్ సి టోల్ గేట్ , అలిపిరి నడక మార్గంలోని ఏడవ మైలు, 29వ మలుపు వద్ద పనులను పరిశీలించారు. అలిపిరి నడక మార్గంలో బాత్ రూమ్ లను పరిశీలించి, మరింత పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఆరోగ్య విభాగం అధికారిని ఆదేశించారు. తిరుమల, అలిపిరి నడక మార్గం పవిత్రతను, స్వచ్ఛతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, దుకాణాదారులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అదేవిధంగా టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. గతంలో కన్నా పచ్చదనం పెంపొందిందని, భక్తులకు మరింత ఆహ్లాదకరంగా ఉండేవిధంగా వివిధ రకాల పుష్పాల మొక్కలు పెంచాలని సూచించారు. అలిపిరి కాలిబాటకు ఇరువైపులా గుంతలు, మిట్టలుగా ఉన్న మట్టిని చదును (లెవల్) చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీల్లో టిటిడి సివిఎస్వో గోపినాధ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఇఇ సురేందర్ రెడ్డి, డిఈ రవి శంకర్ రెడ్డి, విజివో బాలి రెడ్డి, ఎఫ్ ఆర్ వో వెంకట సుబ్బయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.