అటు సింగర్ గా , ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి మన అందరికి తెలిసిన అమ్మాయే. అలానే ప్రస్తుతం ఆడవాళ్ళ మీద జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఆమె ఎప్పుడు నోరు విప్పుతూనే ఉన్నారు. హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా సాగిన మీ టూ కాంపెయిన్ లో కూడా ఈమె పాల్గొన్నారు. ఇప్పుడు ఆమె ఆమెకు జరిగిన అలాంటి ఒక అనుభవం గురించి వెల్లడించారు. ఆమెకు 8 ఏళ్ల లేదా 10 ఏళ్ల వయసున్నప్పుడు ఒకరు ఆమెను వేయరాని చోట చేతులు వేశారని చెప్పుకొచ్చింది. అలాంటి వారు సమాజంలో చీడపురుగులు లాంటి వారని కానీ, పెద్ద మనుషుల ముసుగులో ఇలాంటి వెధవ వేషాలు వేస్తుంటారని, వారివల్ల తాను కూడా లైంగిక వేధింపులను ఎదురుకోవాల్సి వచ్చిందని చిన్మయి పేర్కొన్నారు.
గతకొంతకాలంగా లైంగిక వేధింపుల గురించి పలువురు మహిళలు అలాగే హీరోయిన్ లు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా తనకు జరిగిన అవమానాలను కూడా తెలిపింది చిన్మయి. మహిళలకు ఈ సమాజంలో రక్షణ లేకుండా పోయిందని, చాలా చిన్న వయసులోనే వాళ్ళు లైంగిక వేధింపులకు గురి కావాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సినిమారంగంలో కూడా అలాంటి వారు ఉన్నారు అని, చెప్పిన చిన్మయి పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు మాత్రం ఎవడైనా ఇలాంటి వెధవ వేషాలు వేస్తే చెప్పుతో సమాధానం ఇస్తానంటోంది.
.
Discussion about this post