అన్నం తిన్న తరువాత… మీరేం చేస్తారు.. అని అడిగితే… ఎలాంటి సమాధానాలు వస్తాయి…? చాలామంది ఏముంది కాసేపు రెస్ట్ తీసుకుంటా.. పండ్లు తింటా.. తాంబూలం వేసుకుంటా.. కునుకు తీస్తా.. అనే వెరైటీ వెరైటీ సమాధానాలు చెబుతారు. మరైతే రాత్రిళ్లు అన్నం తిన్న తరువాత ఏం చేస్తారు అని అడిగితే వెంటనే వచ్చే సమాధానం ఏముంది చక్కగా పడుకుని నిద్రపోతాం.. అనే చెప్తారు. అంతేనా.. సరిపోతుందా..? తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అంటూ బతికేస్తే సరిపోతుందా? అయితే ఇది ఎంత వరకు మంచిది? మరి తిన్నాక పడుకోకుండా ఏం చేయాలి? అంటున్నారా.. మీకోసమే ఈ వార్త!
పాతకాలంలో రాత్రి అన్నం పెందరాళే తినేసేవారు. తిన్న తరువాత ఇంటి బయట ఉన్న రకరకాల పనులను చేసుకుని బాగా రాత్రి అయిన తర్వాత పడుకునేవారు. అంటే రాత్రి తొందరగా అన్నం తినేసి, తర్వాత చిన్న చిన్న పనులను చేసుకుని తర్వాత పడుకునేవారు. కాబట్టి అప్పటి వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు… నలభై దాటితేచాలు… ఏం రోగం మనల్ని పట్టుకుంటుందో అని భయపడి చస్తున్నారు. ఏంటి కారణం… ?
ఇవీ చదవండి : తిరుపతి ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థి ఎవరో తెలుసా? మెగాస్టార్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సరికొత్త పాఠం ఇది! టీడీపీతో దోస్తీ వద్దు.. పవన్ కల్యాణ్ ను వేడుకుంటున్న జనసైనికులు తిరుపతి సమరం.. చతుర్ముఖ పారాయణం
కారణం ఏంటి అంటే మన ఆహారపు అలవాట్లు… ! ఒకప్పుడు ఏడు గంటలు కాగానే అన్నం తినేసేవాళ్లు. తర్వాత ఆపనీ ఈపనీ చేసుకుని రాత్రి ఏ తొమ్మిదింటికో నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలకు అన్నం తినడం,,, అప్పటికే అలసిన శరీరం కడుపు నిండగానే విశ్రాంతి కోరడంతో గిన్నె దగ్గరనుండి లేవగానే… చేతి తడి ఆరకుండానే పడకమీదికి చేరడం… ఇది నిజంగా మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోజూ కాసేపు నడిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఓటాగో కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి అన్నం తిన్న తరువాత మనం కొంతసేపు నడిస్తే మన శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయని వారు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైందిట.
సాధారణంగా రోజూ మన ఏదో ఒక సమయంలో నడుస్తూ ఉంటాం… మనం ఆరోగ్యంగా ఉండడానికి నడక ఎంతగానో సాయం చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా రాత్రిళ్లు అన్నం తిన్న తరువాత కనీసం పది నిముషాలు పాటు నడిస్తే అలాంటి వారిలో బ్లడ్ షుగర్ స్థాయిలు బాగా తగ్గినట్టు వారు తెలిపారు. రోజూ అర్థగంటపాటు నడిచేవారిలో బ్లడ్ షుగర్ స్థాయిలు 12 శాతం వరకు తగ్గితే.. రాత్రి భోజనం తరువాత పది నిముషాల పాటు నడిచిన వారిలో ఈ స్థాయి ఏకంగా 22 శాతం వరకు తగ్గినట్టు వారి పరిశోధనలో తేలింది. కాబట్టి రాత్రి ఇలా కడుపులో అన్నం పడగానే… అలా మన మంచంపై పడిపోకుండా… ఓ పదినిముషాల పాటు అలా తిరిగొద్దాం… డయాబెటిస్ లాంటి మహమ్మారికి దూరంగా ఉండాలంటే… చక్కగా రోజూ కాసేపు, రాత్రి భోజనం తర్వాత నడిచేయండి మరి…!
.

Discussion about this post