పెట్టుబడిదారీ వ్యవస్థ సమూలంగా అంతమొందితేనే ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు, అస్పృశ్యతలు సమూలంగా నిర్వీర్యమవుతాయని సీపీఎం శ్రీ కాళహస్తి డివిజన్ పర్యవేక్షకులు అంగేరి పుల్లయ్య అన్నారు.
స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సోమవారం రెడ్ బుక్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పితామహులు మార్క్స్, ఏంగిల్స్ రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక పుస్తకాలను ఆవిష్కరించారు. వాటిపై సుదీర్ఘ చర్చ జరిపారు.
అనంతరం పుల్లయ్య మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్లూనుకోవడంతో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. తద్వారా పేదరికం పెరిగిపోయిందని వాపోయారు.
2008 నుంచి ఈ తేడాలు స్పష్టంగా వెలుగు చూశాయని చెప్పారు. సమాజంలోని ప్రస్తుత పరిణామాలన్నింటినీ అవగతం చేసుకోవాలి అంటే కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాలు ప్రజలకు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. తద్వారా ప్రజలు పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి విముక్తి పొంది సోషలిజం వైపు అడుగులు వేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు షరీఫ్, గంధం మణి, పెనగడం గురవయ్య, గెడి వేణు, కుమార్, వెలివేంద్రం, గంగమ్మ, శీను, కుమార్, నజీవుల్లా, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
.