తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైసిపి తన అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గురుమూర్తి పేరును అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతిచెందడంతో తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
ఎన్నికల బరిలో బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి కి వైసిపి అవకాశం ఇస్తుందని అందరూ భా వించారు. అయితే అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తి పేరు వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో వైసిపి నాయకులు చర్చించారు. ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు.
దీంతో డాక్టర్ గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. రాష్ట్రంలో లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన అన్ని రోజులు ఆయన వెంట ఉండి గురుమూర్తి వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత సైతం వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం ఇప్పటికే పనబాక లక్ష్మి పేరును అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక బరిలో బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి రంగంలో ఉండనున్నారు. ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఇక కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ పోటీ చేసే అవకాశం ఉంది.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి :
తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా?
పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ
పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా?
ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నవరం దళితవాడకు చెందిన డాక్టర్ గురుమూర్తి తిరుపతిలో ప్రైవేటుగా ఫిజియోథెరపిస్ట్ గా వైద్య వృత్తిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు.. గురుమూర్తి కూడా.. తొలినుంచి చివరి వరకు ఆయనతో పాటు నడిచారు. ఆ సమయంలో జగన్ కు ఫిజియోథెరపీ చేస్తుండేవారు. అప్పటి సాన్నిహిత్యమే ఇప్పుడు చట్టసభకు అభ్యర్థిగా ఎంపికచేసినట్లు తెలుస్తోంది.
read this : తిరుపతి బరిలో టీడీపీ లాభపడే అవకాశం ఉందా?
Discussion about this post