బ్రహ్మానందం.. టైటిల్ లో ఈ పేరు లేకుండా తెలుగులో సినిమాలు వచ్చాయే కాదు. స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో బ్రహ్మీ ఉండాల్సిందే అని పట్టుబట్టి మరీ అతని కోసం స్పెషల్ రోల్స్ రాయించే వాళ్లు. బ్రహ్మీ కామెడీ పేలితే సినిమా సగం హిట్ అయిందని భావించే వాళ్లు. కానీ ఇదంతా గతం. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా తనదైన కామెడీ టైమింగ్ తో తెలుగు జనాలను కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మీ ఇప్పుడు బాగా వెనకపడ్డాడు. గత రెండేళ్లుగా ఈ స్టార్ కమెడియన్ తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. బ్రహ్మీ కామెడీని చూసి చూసి ఆడియెన్స్ కు బోర్ కొట్టిందో.. లేక మంచి క్యారెక్టర్స్ పడటం లేదో తెలియదు కానీ ఈ స్టార్ కమెడియన్ పేల్చే జోకులు చూసి చికాకుపడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఈ రెండేళ్లలో ఈ టాప్ కమెడియన్ చేసిన ఒక్క రోల్ కూడా ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేదు. దీంతో బ్రహ్మానందం పని అయిపోయిందనే వార్తలు వచ్చాయి. సిల్వర్ స్క్రీన్ పై బ్యాడ్ టైం నడుస్తుండటంతో స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఓ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు ఈ హాస్యబ్రహ్మ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఈ ప్రెస్ మీట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. తనకు అవకాశాలు రావడం లేదన్న వార్తల్లో నిజం లేదని కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందులా ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయడం లేదని.. తనకు ఆనందాన్ని ఇచ్చే పాత్రలు మాత్రమే చేస్తున్నానని సెలవిచ్చాడు. అంతేకాదు కొత్తగా వచ్చే వారికి కూడా ఛాన్సులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే సినిమాల చేయడం తగ్గించానని బ్రహ్మీ కామెంట్ చేశాడు. ఈ పాయింట్ ను పట్టుకున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఈ స్టార్ కమెడియన్ పై ఓ రేంజ్ లో జోకులు పేల్చుతున్నారు. సినిమాల్లో తగ్గించి బయట కామెడీ చేయడం మొదలుపెట్టావా అని సెటైర్లు వేస్తున్నారు. అసలు ఆయనకే ఆఫర్లు లేవన్న విషయం
అందరికీ తెలిసిందే. ఆ విషయం చెప్పకుండా కొత్త వాళ్ల కోసం తానేదో త్యాగం చేస్తున్నానని బిల్డప్ లు ఇవ్వడం హాస్యాస్పదమని సినీజనాలు పెదవి విరుస్తున్నారు. నిజంగా కొత్తవాళ్లను ప్రోత్సహించాలనుకుంటే.. తను ఫామ్ లో ఉన్నప్పుడు ఒక్కరిని కూడా ఎందుకు ఎంకరేజ్ చేయలేదని డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. అంత ఎందుకు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డిని కమెడియన్ గా ఎదగకుండా తొక్కేసింది నువ్వు కాదా అని సోషల్ మీడియాలో బ్రహ్మానందంపై ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. మరి నెటిజన్ల అడిగే ప్రశ్నలకు బ్రహ్మీ దగ్గర సమాధానాలు ఉన్నాయో లేవో..?
.
Discussion about this post