సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ థామస్ పర్యటన సందర్భంగా పుత్తూరు మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్,కో ఆప్షన్ మెంబర్లు మరియు వైయస్సార్ పార్టీ ముఖ్య నాయకులు వారిని కలిశారు.
ఈ కార్యక్రమంలో పుత్తూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు మరియు ప్రజలకు అవసరమైన కొన్ని వసతుల కొరకు వినతిపత్రం సమర్పించారు.
పుత్తూరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం నందు షెల్టర్ లు మరిన్ని కావాలని, EMU రైళ్ళు ప్రస్తుతం తిరుత్తణి వరకు నడిచేవాటిని పుత్తూరు వరకు పొడిగించాలని, కోరారు.
మొదటి ప్లాట్ఫారం లో (రేణిగుంట సైడ్) పాసింజర్ లకు అనుకూలంగా ట్రాలీ పాత్ లను ఏర్పాటు చేయాలని, RDM గేట్ దగ్గర సాంక్షన్ అయిన రైల్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
పుత్తూరు రైల్వే స్టేషన్ లో కరోనా తరువాత పాసింజర్ లకు జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ లను ఇంకా తెరవలేదని మిగతా చోట్ల తెరిచినా ఇక్కడ ఇంకా చేయనందువలన సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
అతి ప్రధానంగా పుత్తూరు పట్టణమును రెండు గా విడదీస్తున్న ద్రౌపతి అమ్మన్ గుడి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర రైల్ అండర్ బ్రిడ్జి నిర్మించాలని దీనికొరకు చాలా రోజుల నుంచి ప్రజలు ప్రతి రోజు నిత్యావసరాల కొరకు పట్టణం లో రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అదేవిధంగా గా నగరి నియోజకవర్గం లో వచ్చే అన్ని స్టేషన్ లకు సంబందించి వచ్చిన రైల్వే సంబంధిత సమస్యలను పూడి స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు తొందరగా చేయాలని, వేమాపురం అండర్ బ్రిడ్జి లీకేజీ పనులకు తగిన అనుమతులు మంజూరు చేయాలని, ఏకాంబరకుప్పం గేట్ అండర్ బ్రిడ్జి పనులు చేపట్టాలని కోరారు.
.