మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర‌్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, గార్జీయస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ రాసిన కథతో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సిద్ధం అవుతున్న మూవీ 18 పేజీస్.
100 పర్సెంట్ లవ్, భలే భలే మగాడివోయ్, పిల్లానువ్వులేని జీవితం, గీత గోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని నిర్మించిన జీఏ2పిక్చర్స్ – కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా 18 పేజీస్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 18 పేజీస్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో 18 పేజీస్ విడుదల తేదిని నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో ఫిబ్రవరి 18, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా బన్నీవాసు తెలిపారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ 18 పేజీస్ ని కూడా వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు.
నవీన్ నూలీ ఈ చిత్రానికి ఎడిటర్ కాగా ఏ వసంత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు, బాబు కో ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవనున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల అవుతుంది.
.

Discussion about this post