పబ్జీలోనే మునిగితేలుతూ.. ఇంకో ప్రపంచంతో సంబంధం లేనట్లుగా బతికిపోయే కుర్రకారు మనదేశంలో చాలా మందే ఉన్నారు. అదంతా నిన్నటి చరిత్ర. మోదీ సర్కారు పుణ్యమా అని.. పబ్జీకి సమాధి కట్టేశారు. అఫ్ కోర్స్, దానికి ప్రత్యామ్నాయంగా.. వ్యసనపరులైపోయిన యువత వేరే గేమ్స్ వెతుక్కుని ఆడుకుంటున్నారు గానీ.. పబ్జీ.. మనదేశ నిబంధనలకు అనుగుణంగా.. కొన్ని మార్పు చేర్పులతో అతిపెద్దదైన ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
భారత దేశంలో పబ్జీని ప్రేమించేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ గేమ్ డెవెలపర్స్ ఈ మధ్యనే పబ్జీ భారత దేశానికి మళ్లీ తిరిగి రాబోతోంది అని ప్రకటించారు. ఈసారి, మన దేశం కోసం ప్రత్యేకంగా ‘పబ్జీ మొబైల్ ఇండియా’ అని కొత్త గేమ్ లాంచ్ చేయబోతున్నారంట. కంపెనీ దీని గురించి ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ లలో కూడా తెలిపింది.
కొత్తగా రాబోతున్న పబ్జీ గేమ్ మన దేశం పెట్టుకున్న నిబంధలను అనుసరిస్తూ, ఆడేవాళ్లకు పూర్తి భద్రతను పెంచబోతోంది. అంతే కాదు, వ్యక్తిగత సమాచార భద్రత గురించి కూడా ధృవీకరణ జరుగుతూ ఉంటుంది అని కూడా తెలిపారు. అన్నింటిలోకి అతి మంచి విషయం ఏంటంటే, కొద్దిగా చిన్నవాళ్లు ఆడుతున్నారంటే, వాళ్లు ఒక ప్రత్యేక సమయం కన్నా మించి ఆడకుండా చూస్కునేటట్లు కొత్త ‘ఫీచర్’ రాబోతోంది.
పబ్జీ ఇంక క్రాఫ్టన్ భారత దేశంలో వీడియో గేమ్, ఇ-స్పోర్ట్స్, ఎంటర్టైన్‌మెంట్, ఐటీ సంస్థలు, లాంటి వాటితో వ్యవస్థను ఏర్పరచుకోవడానికి దాదాపు 100 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు. ఇది కాకుండా, ఇక్కడ ఒక 100 ఉద్యోగాలు ఇచ్చి లోకల్ ఆఫీస్ పెట్టాలని కూడా అనుకుంటున్నారు. మొత్తానికి ఉద్యోగాల విషయంలో మాత్రం మంచే జరగబోతున్నట్టుంది. అంతవరకూ జరగచ్చు గానీ.. ఇది ఎంత సక్సెస్ అయినప్పటికీ.. లాభాలు విదేశాలకు వెళతాయే తప్ప.. స్వదేశంలో ఎక్కువ ఉద్యోగావకాశాలు వచ్చే పరిస్థితి ఇలాంటి వాటితో ఎంతమాత్రమూ లేదు.
ఇదీ చదవండి చిరంజీవి విషయంలో వాళ్లు నోరు మూస్కోవాలి గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటో? ఎలా గుర్తించాలో తెలుసా?
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం పబ్జీతో పాటు 116 చైనీస్ యాప్‌లను నిషేధించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎలెక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ తెలిపిందేంటంటే ఈ యాప్‌లు భారత దేశం పట్ల కొంద పక్షపాతం చూపించాయి అని… మరికొన్ని యాప్స్ వ్యక్తిగత డేటాను దొంగిలించి వేరే దేశాల సర్వర్స్ కి ప్రసారం చేస్తున్నాయని కూడా సమాచారం ఇచ్చింది. దీని పట్ల చాలా జనం ప్రతికూలంగా ప్రతిచర్య తీసుకున్నారు. అందరికన్నా ఎక్కువ నిరాశ చెందినది ఆటను ప్రేమించిన వాళ్లే.
పబ్జీ అనే గేమ్‌కు సంబంధించి చాలా ఆత్మహత్యలు జరిగాయి. లక్ష్లలకు లక్షల రూపాయలు కోల్పోయిన వాళ్లున్నారు. ఇప్పుడు పబ్జీ మళ్లీ వస్తానంటోంది. ఈసారి వచ్చినప్పుడు, పబ్జీ ఎలాంటి చావులూ తీసుకురాదు అని ఆశించాలి.
.

Discussion about this post