• About Us
  • Contact Us
  • Our Team
Thursday, September 17, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలి మాట : ఏది మంచి?  ఏది చెడు?

మంచి చెడులను తూకం వేయడం చాలా కష్టం. అలాగే నిర్వచించడం కూడా కష్టం. ఈ మాటలు కేవలం దృక్కోణం మాత్రమే అంటున్న లోపలిమాట.

admin by admin
June 28, 2021
0
లోపలి మాట : ఏది మంచి?  ఏది చెడు?

ఏ విషయమైనా మనకు అనుకూలంగా జరిగితే మంచి అని, ప్రతికూలంగా జరిగితే చెడు అని సాధారణంగా భావిస్తుంటాం. కానీ, ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరికి చెడుగా తోచవచ్చు.

ఉదాహరణకి:

ఒక ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములుంటారు. వారిలో ఒకరికి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ఇష్టం. మరొకరికి బాగా పొద్దెక్కాక నిద్రలేవడం ఇష్టం. కానీ, ముందే నిద్రలేచినవాడు ‘ఇంత పొద్దెక్కినా నిద్రపోతున్నాడు దరిద్రుడు’ అనుకుని ఆలస్యంగా నిద్రలేచినవాడిని నిందించి అది చెడు అలవాటుగా పరిగణిస్తాడు. అదేవిధంగా బాగా పొద్దెక్కాక నిద్రలేచినవాడు ‘వీడు ఇంత తొందరగా నిద్రలేచి ఎవరిని ఉద్దరించాలి’ అని ముందుగా నిద్రలేచినవాడిని నిందించి దాన్ని చెడు అలవాటుగా భావిస్తాడు. ఎవరి దృష్టిలో వారు చూసుకున్నప్పుడు ఇద్దరిదీ సరియైనదే అనిపిస్తుంది. కానీ, ఒకరి దృష్టిలో మరోకరు పోల్చుకున్నప్పుడు ఒకరి పని మరోకరికి చెడుగా కనిపిస్తుంది. మరి వీళ్ళ ఇద్దరిలో ఎవరిది మంచి? ఎవరిది చెడు? అని నిర్ణయించగలం.

deviprasad obbu columnistఇంకొక ఉదాహరణ:

టీవీలో మంచి సినిమా వస్తూ ఉంది. ఇంట్లో అందరూ కలిసి ఆసక్తిగా చూస్తున్నారు.ఆ సినిమాలో తరువాత సన్నివేశం ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఉంది. అంత రసవత్తంగా సాగుతోంది సినిమా. అలాంటి సమయంలో కరెంటు పోయింది. అంతే కరెంటు తీసేసిన వాళ్ళని అందరూ కలిసి దుమ్మెత్తి పోశారు. అప్పుడు కరెంటు వాళ్ళు చేసింది తప్పుగా భావించడం వల్ల ఆ పని అక్కడున్న అందరికీ చెడుగా అనిపించింది. కానీ, సాంకేతిక సమస్యలవల్ల కరెంటు వాళ్ళు లైన్ ఆఫ్ చేసి సమస్యను సరిదిద్దిన తర్వాత మళ్ళీ కరెంటు ఇచ్చారు. ప్రజలు ఇబ్బంది పడకూడదని సకాలంలో పని పూర్తిచేసి కరెంటుని ఇవ్వడం తమ బాధ్యతగా భావించి ఆ పని చేశారు. కరెంటు వాళ్ళ దృష్టిలో అది మంచి పని. టీవీ చూసే వాళ్ళ దృష్టిలో అది చెడ్డ పని. కాబట్టి ఇక్కడ ఎవరు మంచివారు? ఎవరు చెడ్డవారు? అని నిర్ణయించగలం.

మరొక ఉదాహరణ :

అడవిలో కౄరజంతువులు, సాధుజంతువులు రెండూ ఉంటాయి. కౄరజంతువులు తమ ఆకలి తీర్చుకోవడం కోసం సాధుజంతువులను వేటాడి తినేస్తాయి. అలాగే సాధుజంతువులు తమ ఆకలి తీర్చుకోవడం కోసం చెట్లమీద పడి పండ్లను, కాయలను తినేస్తాయి. సాధుజంతువుల దృష్టిలో కౄరజంతువులు పరమ దుర్మార్గమైనవిగా, చెడ్డవిగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి తమ మనుగడకే ముప్పు కలిగించడంవల్ల. అలాగే చెట్ల దృష్టిలో సాధుజంతువులు కూడా చెడ్డవిగా కనిపిస్తాయి. ఎందుకంటే తమ మీద పడి నానా భీభత్సం చేసి నిర్దాక్షణ్యంగా పండ్లను, కాయలను తినేయడంవల్ల.

మరి ఇక్కడ ఎవరిని మంచి? ఎవరిని చెడు అని నిర్ణయించగలం.

పై ఉదాహరణలను పరిశీలించిన తరువాత మనకు అవగతమైన విషయం ఏంటంటే.. అసలు లోకంలో మంచిచెడులు అనేవి లేవు. ఎందుకంటే ఒకే విషయం ఒకరికి మంచిగా మరోకరికి చెడుగా గోచరించడంలోనే అవి వాటి ఉనికిని కోల్పోయాయి. అవి కేవలం ఊహాత్మక భావనలు మాత్రమే.  మరి మంచి,చెడు అనేవి లోకంలో ఎందుకు చెలామణి అవుతున్నాయి? అనే ప్రశ్న ఉదయిస్తుంది.

నిజానికి మంచి,చెడులకు ఉనికిలేదు. వాటికి మనమే ప్రాణం పోస్తాం. మనకు ఏదైనా అనుకూలంగా జరిగినప్పుడు మంచిగా భావించి వెంటనే స్వీకరించేస్తాం.నిజానికి ఆ సమయంలో అది మంచిదనే సృహ కూడా ఉండదు. అదే ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు స్వీకరించడానికి మనసు అంగీకరించదు. అప్పుడు ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణే మనకు చెడుగా అనిపిస్తుంది. ఆ కారణంచేతనే మంచికి కూడా ఉనికి ఏర్పడుతుంది. దుఃఖం కలిగినప్పుడే సుఖం విలువ, నష్టం కలిగినప్పుడే లాభం విలువ తెలిసినట్లుగా చెడు కలిగినప్పుడు మంచి విలువ తెలుస్తుంది. ఆ విధంగా మంచి,చెడులనేవి లోకంలో ఏర్పడ్డాయి. మరి ఏది మంచి? ఏది చెడు? అనే ప్రశ్నను మా పైకి సంధించడంలో మీ ఉద్దేశం ఏమిటి? అని మీరు నన్ను అడవచ్చు.

అక్కడికే వస్తున్నా…

మనకు ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఆవేశానికి లోనుకాకుండా, ఆ పరిస్థితి కలగడానికి  అసలైన కారణాలేమిటో విచారించి, విశ్లేషించి విజ్ఞతతో మెలిగినప్పుడే లోకం జరిగే ప్రతిదీ మనకు మంచిగా కనిపిస్తుంది.

…దేవీప్రసాద్ ఒబ్బు

9866251159.

Tags: deviprasaddeviprasad obbulopalimataobbu deviprasadobbu prasadrightwhat is wrong
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply