ఎట్టకేలకు ‘పుష్ప : ది రైజ్’ విడుదల తేదీ ఖరారు అయింది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవులనుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా.. తయారుచేసిన యాక్షన్ ఓరియెంటెడ్ కథతో.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రెండు చిత్రాల సిరీస్ లో మొదటి భాగం ‘పుష్ప: దిరైజ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబరులో విడుదల కానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పుష్ప చిత్రం విడుదలకు ముందే ఇప్పటికే అనేకానేక రికార్డులు బద్దలు కొట్టింది. చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు అద్భుతమైన స్పందన రాబట్టాయి. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టీజర్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది.
రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. డిసెంబర్ 17న పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
పుష్ప రెండు చిత్రాల సిరీస్ తో తిరుగులేని యాక్షన్ హీరోగా అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ పాన్ ఇండియా స్థాయికి పెరుగుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కేరళలో అయితే.. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా బన్నీ డబ్బింగ్ చిత్రాలు కలెక్షన్లు రాబడుతుంటాయి.
ఇవి కూడా చదవండి :
బద్వేలును వదిలించుకోవాలని మిత్రులిద్దరిలో ఆరాటం
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
బద్వేలునుంచి జారుకోవడానికి పోటీపడుతున్న జనసేన-బీజేపీ
.

Discussion about this post