అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య, ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరికి సంబంధించి తప్పుగా మాట్లాడినందుకు ఆయన కన్నీళ్ల పర్యంతం అయ్యారు. సభ్యసమాజం ఎవరైనా సిగ్గుతో తలదించుకునే వ్యవహారమే ఇది.
దీనిపై చంద్రబాబునాయుడుకు సాంత్వన కలిగేలా చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా స్పందించారు. తలైవా రజనీకాంత్, సోనూసూద్ లాంటి వాళ్లు కూడా స్పదించి ఆయనకు ఫోను చేసి ఊరడించారు. బాలయ్య నందమూరి కుటుంబం అందరితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి నిప్పులు చెరగగా.. జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇలాంటి పనులను ఖండించారు.
నిజానికి ఈ ఎపిసోడ్ గురించి చాలా మంది రెచ్చిపోయి మాట్లాడిన మాటల కంటె.. జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో సందేశానికి చాలా మంచి స్పందన వచ్చింది. ఎవరైతే నిదలు పడ్డారో.. ఆ భువనేశ్వరి.. జూనియర్ ఎన్టీఆర్ కు స్వయానా మేనత్త. అలాంటప్పుడు.. నందమూరి కుటుంబ సభ్యుడిగా- తన భావావేశాన్ని వ్యక్తం చేయకుండా ఉంటారనుకోవడం భ్రమ.
ఇది కూడా చదవండి : జగన్ మడమ తిప్పని నేత అంటారు గానీ.. మాట మార్చేసే నేత
కన్నుకు కన్ను- అనే రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా.. ఎన్టీఆర్ మాట్లాడిన తీరులోని సంయమనం- ఆ నెమ్మదితనానికి చాలా మంది హేట్సాఫ్ అన్నారు. తన మేనత్త అనే కాకుండా ఏ మహిళ గురించి కూడా అలాంటి అవమానకరమైన మాటలు తగవని ఎన్టీఆర్ చెప్పాడు. నందమూరి కుటుంబ సభ్యుడిగా కాకుండా.. ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా ఈ మాటలు చెబుతున్నానంటూ ఆయన చెప్పిన ఉద్వేగభరితమైన తీరు- అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అంతటి బ్యాలెన్స్‌తో ఈ ఎపిసోడ్ లో ఎవ్వరూ మాట్లాడలేకపోయారని అంతా అనుకున్నారు కూడా.
అయితే- ఈ విషయంలో కొందరు మూర్ఖగా ఎన్టీఆర్ మాటలనే విమర్శిస్తున్నారు. ఒకరు నీచంగా మాట్లాడారంటే.. దానికి జవాబుగా మనం అంతకంటె నీచంగా మాట్లాడాలి, అంతకంటె నీచంగా తిట్టాలి, అంతకంటె నీచంగా ప్రత్యర్థుల ఇళ్లలోని ఆడవాళ్ల గురించి కామెంట్ చేయాలి అనుకునే మూర్ఖులు కొందరు ఉంటారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అలాంటి వారికి జూనియర్ ఎన్టీఆర్ ఇంత బ్యాలెన్స్డ్ గా పద్ధతిగా మాట్లాడడం నచ్చలేదు. ఎన్టీఆర్ సందేశం తుస్సుమనిపించిందని, ఆయన మాటలు చిలకపలుకుల్లాగా ఉన్నాయని, సన్నాసులతో స్నేహం చేసి ఏం మాట్లాడాలో తెలియడం లేదని ఆడిపోసుకుంటున్నారు. అలాంటి వారు ఎంతటి విద్వేష, విష భావనలతో రగిలిపోతున్నారో ఎన్టీఆర్ పై చేస్తున్న కామెంట్లు చూస్తేనే తెలుస్తోంది. దారుణం ఏంటంటే.. ఇలా విమర్శిస్తున్న వారి పోస్టులు.. తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండే ఫేస్ బుక్ గ్రూపుల్లోనే చెలామణీ అవుతున్నాయి.
ఎంతో మర్యాదగా, హుందాగా ప్రతిస్పందించిన జూనియర్ ఎన్టీఆర్ తిట్టడం.. ఏమాత్రం కరెక్టు కాదని.. జూనియర్ ఎన్టీఆర్.. కేవలం ఎన్టీఆర్ కుటుంబానికే కాదు.. మహానటుడు ఎన్టీఆర్ కు, ఆయన ప్రతిష్ఠకు, గౌరవానికి కూడా ముమ్మూర్తులా వారసుడని వారు తెలుసుకోవాలి.
ఇదీ తెలుగుదేశం ఫేస్ బుక్ గ్రూపుల్లో కనిపిస్తున్న పోస్టు :

.

Discussion about this post