డిసెంబరులో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
డిసెంబరు 1 నుండి 2022, ఫిబ్రవరి 28వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఋగ్వేద పారాయణం.
– డిసెంబరు 2న ధన్వంతరి జయంతి.
– డిసెంబరు 4న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనసేవ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పౌర్ణమి గరుడసేవ కాసులమాల ఊరేగింపు.
– డిసెంబరు 8న పంచమీ తీర్థం సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి పడి ఊరేగింపు.
– డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం.
– డిసెంబరు 14న గీతాజయంతి.
– డిసెంబరు 15న చక్రతీర్థ ముక్కోటి.
– డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం.
– డిసెంబరు 18న దత్త జయంతి.
– డిసెంబరు 19న పౌర్ణమి గరుడసేవ.
.
Discussion about this post