డాలర్ శేషాద్రి స్వామి పార్థివదేహానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన అశ్రు నివాళి అర్పించారు.
విశాపట్టణంలో టీటీడీ తలపెట్టిన కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి వెళ్లి.. అక్కడే గుండెపోటుతో మరణించిన డాలర్ శేషాద్రి పార్థివదేహం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. తిరుపతికి చేరుకుంది.
డాలర్ శేషాద్రి స్వామి పార్ధీవ దేహానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కన్నీటి నివాళులు అర్పించారు.
తిరుపతి లోని డాలర్ శేషాద్రి స్వామి వారి నివాసం వద్దకు మంగళవారం ఉదయం చేరుకుని పూల మాల వేసి, పాదాలకు నమస్కరించారు.
శేషాద్రి స్వామి పార్ధివదేహాన్ని తదేకంగా చూస్తూ, కంట తడి పెట్టారు. డాలర్ శేషాద్రి స్వామి సతీమణిని పరామర్శించారు.
డాలర్ శేషాద్రి స్వామి పార్ధివ దేహానికి తిరుపతి సిరిగిరి ఆపార్ట్ మెంట్ వద్ద మంగళవారం ఉదయం తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ నివాళులు అర్పించారు.
తీరని లోటు : ఎమ్మెల్యే భూమన
శేషాద్రి స్వామి 43 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో నిస్వార్దంగా సేవలందించారు అని ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆలయ ఆచార్య వ్యవహారాల పై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి శేషాద్రి స్వామి అని పేర్కొన్నారు. నిజాయితీతో నిబద్దతతో సేవలందించిన వ్యక్తి అని, సామాన్యులు నుంచి విఐపిల వరకు పరిచయం వున్న వ్యక్తి శేషాద్రి స్వామి అని కొనియాడారు.
2వేల సంవత్సరాల చరిత్ర వున్న శ్రీవారి ఆలయంలో శేషాద్రి స్వామి అందించిన సేవలు వెలకట్టలేనివి అని కితాబు ఇచ్చారు. శేషాద్రి స్వామి మరణం శ్రీవారి ఆలయానికే తీరని లోటుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
.

Discussion about this post