డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత దేశ నిర్ధేశకుడని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
అనంతరం పుల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్తే కాకుండా దేశంలో కుల, ఆర్ధిక, సాంఘిక వ్యవస్థలలో సమానత్వాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు.
అయితే నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా చట్టాలు చేస్తోందంటూ మండిపడ్డారు.
ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
పట్టణ బాధ్యుడు గంధం మణి, సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి కావేరి వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, రామకృష్ణ, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
.