నవయుగ కన్స్ట్రక్షన్స్ అధినేత చింతా విశ్వేశ్వర రావు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ముందుగా వారికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె పవిత్ర రెడ్డి, తనయుడు ఆకర్ష్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం శ్రీకాళహస్తి కే ప్రఖ్యాతిగాంచిన స్వామి అమ్మవార్ల కలంకారీ చిత్రపటం అందజేశారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు గారు, దర్శన ఆశీర్వాద ఏర్పాట్లు చేశారు .
.