ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా, ముందుగా హెచ్చరించకుండా.. జీవనాధారంగా తాము మేపుకుంటున్న పందుల్ని మునిసిపాలిటీ వారు పట్టుకెళ్లడంతో.. శ్రీకాళహస్తిలో పందుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగించే వారు గొల్లుమంటున్నారు.
ఈ విషయంపై వారికి అండగా నిలబడి సీపీఐ వారి డిమాండ్ కు మద్దతిస్తోంది.
శ్రీకాళహస్తి పట్టణంలో పందులను సాకుతూ జీవనాధారం సాగిస్తున్న వ్యక్తులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారి జీవాలను పురపాలకసంఘం సిబ్బంది పట్టిఉంచడంపై, శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయం వద్ద సిపిఐ శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జన్మల గురవయ్య ఆధ్వర్యంలో దేవర్లు నిరసన తెలియజేశారు.
అనంతరం జనమాల గురవయ్య మరియు దేవర్లు మాట్లాడుతూ.. పందులు సాకుతు జీవనాధారం సాగించుకుంటున్న తమకు పురపాలకసంఘంఅధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారి జీవాలను పట్టిఉంచడం
సబబుకాదని అన్నారు.
వారి జీవాలను వారికి వెంటనే అప్పగించాలని లేనిపక్షంలో నష్టపరిహారం చెల్లించాలని వారు పురపాలక సంఘం అధికారులకు డిమాండ్ చేశారు.
.