అమరావతి రైతులకు మద్దతుగా మోకాళ్లపై నిల్చుని వారికి పాదాభివందనం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట మండలం లో పర్యటిస్తున్న న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరగాలని పలువురు అభిలషిస్తున్నారు.
తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు ప్రకాష్ నాయుడు వారి అనుచరులతో కలిసి మోకాళ్లపై కూర్చొని అమరావతి రైతులకు,అమరావతి జేఏసీ నాయకులకు పాదాభివందనం చేయడం జరిగినది.
వీరు శ్రీ కలియుగ దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే లోగా ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మారి అమరావతిని ఆంద్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని ప్రకాష్ నాయుడు కోరారు.
అదే విధముగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు,జేఏసీ నాయకులకు జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కరుణ కటాక్షం వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా కలగాలని కోరుకోవడం జరిగింది.
.