శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్, బేరివారిమండపం వద్ద బుధవారం 73వ భారత గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోలా ఆనంద్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమతో కలసి బీజేపీ తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు డా. చంద్రప్ప పాల్గొన్నారు.
కోలా ఆనంద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను మరువ కూడదన్నారు. వారి త్యాగాల తోనే భారత దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు.
భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుదామని బీజేపీ నేత డాక్టర్ చంద్రప్ప అన్నారు. వచ్చే ఏడాది నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 నాడు జరుపుకునే పరాక్రమ్ దివస్ నుంచి గాంధీజీ మరణించిన రోజు జనవరి 30వ తేదీన జరిపే అమరవీరుల దినోత్సవం వరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కాసరం రమేష్, వజ్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
.