ఎస్వీ యూనివర్సిటీ లో పని చేస్తున్న హాస్టల్ ఎన్ ఎమ్ ఆర్ లను టైంస్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలని బుధవారం సాయంత్రం 5 గంటలకు తిరుపతి ఎస్ వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్, రెక్టార్ లను విడివిడిగా కలిసి ఏఐటీయూసీ అద్వర్యం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. మురళి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో 1996 సంవత్సరం నుంచి హాస్టల్స్ లో 325 మంది ఎంఎమ్ఆర్ లుగా పనిచేస్తున్నారు. వీరి చాలి చాలని జీతాలతో దుర్భర జీవనం సాగిస్తూ ఉద్యోగ విరమన పొందే పరిస్థితుల్లో వున్నారన్నారు.
పాలక మండలిలో వీరి సమస్యల పై చర్చించి టైం స్కెల్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
యూనివర్సిటీ హాస్టల్స్ ఎన్ఎమ్ఆర్ లను టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలి. నవంబర్, జనవరి 2019 సంవత్సరం పాలకమండలిలో పెంచిన జీతాలు 7 నెలల ఆరియర్స్ తక్షణమే ఇవ్వాలని. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 18 మంది వర్కర్ లను ఎన్ఎమ్ఆర్ లుగా గుర్తించాలని, హాస్టల్ ఎన్ఎమ్ఆర్ లకు ఇపుడు చెల్లిస్తున్న విధంగానే యూనివర్సిటీ నే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ ఎన్ ఎమ్ ఆర్ ల సమస్యలు బోర్డు సమావేశంలో మాట్లాడి పరిష్కారం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ND రవి ఎస్ వి యూనివర్సిటీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, రాజశేఖర్, మణికంఠ గిరి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post