మూడు తరాల బంధం వారి కుటుంబాల మధ్య ఉంది! కేవలం సినిమా ప్రమోషన్ కోసం కొన్ని మాటలు చెప్పడం వేరు. కానీ.. మూడు తరాల అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ.. మనసులోని ఫీలింగ్స్ ఆవిష్కరించడం వేరు. అక్కినేని కుటుంబంతో అల్లు కుటుంబం అనుబంధాన్ని తెలియజెబుతూ.. అర్జున్ అదే పని చేశారు.
గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం గ్రాండ్ సక్సెస్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వేడుకలో బన్నీ ప్రసంగం ఆద్యంతం భావోద్వేగ భరితంగా సాగింది. అనుబంధాల నెమరువేతలాగా సాగిపోయింది.
ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ ను అభినందించారు. అఖిల్ ని చూస్తే నాకు యంగర్ బ్రదర్ లా అనిపిస్తుంది అఖిల్ సినిమా రాకముందే నేను నాగార్జున సార్ ని కలిశాను అఖిల్ ని ఇలా చేస్తే బాగుంటుందా అనేసి నా చిన్న సలహా ఇచ్చి కలవడం జరిగింది. ఇష్టం ఉంది కాబట్టే వేరే ఫ్యామిలీ హీరో అయినా కూడా నేను వెళ్లి చెప్పడం జరిగింది. అలాంటి అఖిల్ కి ఈ రోజు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
అఖిల్ చాలా బాగా డాన్స్ చేస్తాడు బాగా ఫైట్ చేస్తాడు ఇవన్నీ చేయగలిగి కూడా మంచి ఫ్యామిలీ సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని ఒక మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా చేశాడు. అందుకే ఏ ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైంది. తను ఎన్నుకున్న కథ చాలా బాగుంది. ఐ రియల్లీ అప్రిషియేట్. మా నాన్న చెప్పినట్టు ఎక్కడున్నా అక్కినేని నాగేశ్వరరావు, మా తాత అల్లు రామలింగయ్య ఈ సక్సెస్ ను చూస్తుంటారు. అక్కినేని గారి ఫ్యామిలీ తో మా ప్రయాణం చాలా సంవత్సరాలుగా సాగుతుంది. ఫ్యూచర్ లో కూడా మా జర్నీ అలాగే కంటిన్యూ సాగుతుంది.
లవ్ స్టోరీ సినిమా ద్వారా చైతన్య, ఇపుడు అఖిల్ ఇద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇద్దరు బ్రదర్స్ కూడా ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారు. వీరిద్దరికీ కంగ్రాచులేషన్. పూజాను నేను డీజే నుంచి చూస్తున్నాను సినిమా తర్వాత సినిమా తన పెర్ఫార్మన్స్ తో బెటర్మెంట్ ఇస్తూ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా హార్డ్ వర్కర్, వాసు వర్మ ఈ సినిమాకు చాలా సపోర్ట్ గా నిలిచారు. గోపి సుందర్ కి తెలుగు రాకపోయినా చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. బన్నీ వాసు గారు మరొక బిగ్ హిట్ ని అందు కున్నాడు.
ఈ మధ్యకాలంలో బన్నీ వాసు ఇంత కష్టపడడం నేను చూడలేదు.. మా నాన్నగారిని నేను నలభై సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన ఎప్పుడు కష్ట పడుతూనే ఉంటాడు.మా ఫాదర్ పెద్ద, పెద్ద స్టార్ హీరోలతో, కొత్త వాళ్లతో తర్డ్ జనరేషన్ హీరోస్ తో ఇలా అందరితో పని చేస్తూ మంచి కథలతో బెస్ట్ మూవీస్ ఇస్తున్నాడు. టీం అంతా ఎంతో కష్టపడి మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు. మంచి సినిమా తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని ఈ సినిమా నిరూ పించింది. ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
.

Discussion about this post