రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.
టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ అందించారు.
ఈ కార్యక్రమంలో జెఈఓ (ఆరోగ్యం, విద్య) సదా భార్గవి, డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు, కస్తూరిబాయి, విజిఓ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post