తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 520వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 18వ తేదీ సాయంత్రం తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయం నుండి బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు.
అనంతరం ప్రముఖ కళాకారులతో దినము ద్వాదశి సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ తరువాత అహోబిలం, శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు.
చివరగా శ్రీ తాళ్లపాక వంశీయులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
.