రాష్ట్ర జేఏసీ అమరావతి జేఏసీ ఆదేశాల మేరకు ఫ్యాప్టో చేపట్టిన చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఏపీఎన్జీవో నాయకులు మద్దతు తెలిపారు.
శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల నుంచి పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారన్న సంగతి తెలుసుకున్న పోలీసులు కొంతమందిని గృహ నిర్బంధం చేశారు.
కొందరు మాత్రం ముందు రోజే చిత్తూరుకు చేరుకోవడంతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలిపారు.
ప్రస్తుతం ఇచ్చిన హెచ్ ఆర్ ఏ , సి ఎల్ ఏ ను రద్దు చేయాలని , రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ జి ఓ లను రద్దు పరచి మెరుగైన హెచ్ ఆర్ ఏ, పాత సి సి ఏ , పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాల కంటే తగ్గించి ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందంటూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ జిల్లా అధ్యక్షులు పి ఎం ఆర్ ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాళహస్తి ఎన్జీవో నాయకులు సి.చెంచురత్నం యాదవ్, కార్యదర్శి రఘు, ఏపీటీఎఫ్ నాయకులు దావాల జయరాం, మురళీకృష్ణ ,చంద్ర, హేమ కుమార్, వెంకటాద్రి ,
ఎస్టీయూ నాయకులు మురళి, యూటీఎఫ్ నాయకులు గాలి సురేష్, ఏపీ ఎన్జీవో జిల్లా నాయకులు మురళి, ప్రసాద్, నరేష్, ప్రదీప్ , శ్రీకాళహస్తి ఎన్జీవో నాయకులు సుబ్బారెడ్డి భాస్కర్ పలువురు మహిళ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘ నేతలు పాల్గొన్నారు.
Discussion about this post