కేంద్ర ప్రభుత్వం చంపేసాము క్షమించండి అంటే సరిపోతుందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. సోమవారం నగరి లో ఆయన మీడియా తో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతులకు సంబందించిన ఉరితాళ్లు లాంటి మూడు చట్టాలను ప్రవేశ పెట్టి ఇంతకాలం తర్వాత ఉపసంహరించుకుందన్నారు.
ఆ చట్టాలు ప్రవేశ పెట్టేటప్పుడు చర్చలు లేకుండానే ఆమోదింపచేశారు. దీంతో దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు.
వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఈ నేపధ్యంలో పంజాబ్,యూపీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చట్టాలను వెనక్కి తీసుకున్నా రన్నారు.
అది మంచిదే అన్నారు.అయితే లక్నోపూర్ ఘటన లో మంత్రి కొడుకే హత్యకు పాల్పడినట్లు ఫారోనిక్స్ గుర్తించిందన్నారు.అలాంటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఎందుకు మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించారు.
ఆందోళన లు కొనసాగించిన కాలం లో 750 మంది రైతులు చనిపోయారన్నారు.వారికి ఎలాంటి పరిహారం చెల్లించలేదన్నారు.బిజేపి అనుసరిస్తున్న నిరంకుశ పాలన రైతులకు గుదిబండగా మారిందన్నారు.వాటన్నింటి మీద పార్లమెంట్ లో చర్చ ఎందుకు జరగలేదన్నారు.
అవేం లేకుండా మూజువాణి ఓటు తో ఆమోదాలు చేసుకుంటే ఎలా అన్నారు.రైతులకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు.
.
Discussion about this post