తెలంగాణలో లెక్కకు మిక్కిలిగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. కిడ్నాప్‌లు, కిడ్నాప్ మరియు హత్యలు ఇటీవల బాగా పెరుగుతున్న నేపథ్యంలో.. అదే తరహా కేసులు శృతి మించుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ తరహా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. పసిపిల్లు పెద్దవాళ్లు, ఆడ-మగ తేడాలేమీ ఉండట్లేదు. తప్పిపోవడం, కనిపించకపోవడం జరుగుతూనే ఉంది. ఒక్కరోజులో 65 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయంటే.. ఎంత తీవ్రత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇవి కేవలం పోలీసులకు ఫిర్యాదుల రూపంలో నమోదు అయినవి మాత్రమే. స్టేషన్ దాకా రాకుండా ఉన్నవి ఎన్ని ఉంటున్నాయో తెలియదు కూడా!
తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగురోజుల్లో తెలంగాణలో 203 మంది అదృశ్యం అయినట్లుగా కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల అధికారిక వైబ్‌సైట్‌లో ఈ మిస్సింగ్ కేసుల వివరాలు నమోదు అవుతున్నాయి.
ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65మంది అదృశ్యం అయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 8 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 26న 65 మిస్సింగ్ కేసులు, 27న 62 కేసులు, 28న 65 కేసులు నమోదు అయ్యాయి.
గురువారం 11 మిస్సింగ్ కేసులు నమోదు అయినట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. వివిధ కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.
.