అభివృద్ధికి మారు పేరు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి 74వ జన్మదిన వేడుకలు టీడీపీ నేతలు శుక్రవారం శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. అన్నదానం చేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షులు యశోద కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఎన్టీ ఆర్ విగ్రహం వద్ద పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కిట్టు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ… బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకు ఏనాడూ అవినీతి మచ్చ అంటలేదన్నారు. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడానికి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన హయాంలో శ్రీకాళహస్తికి పలు విద్యాసంస్థలు తెప్పించారన్నారు. శ్రీకాళహస్తిని పారిశ్రామికంగా కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు రెడ్డివారి గురువారెడ్డి, గుమ్మడిపూడి దశరథ ఆచారి, తెలుగు యువత క్రిష్ణయాదవ్, ప్రతాప్, వినయ్, బాలాజీ, ఎస్టీ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య, మైనారిటీ ప్రధాన కార్యదర్శి జిలానీ,గగుర్రప్పశెట్టి, మిన్నల్ రవి, యాదగిరి, మణి, దుర్గ, సంధ్య, త్రివేణి, ప్రమీలమ్మ, నెమళ్ళూరు బుజ్జి, మురళి, లక్ష్మణ్, శంకర్ నాయుడు, భాస్కర్, గుణయాదవ్, మునెయ్య, సంపత్, మునిరాజా యాదవ్, బాలాజీ, రామచంద్రయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.