వాళ్లిద్దరూ అపరిమితమైన విద్యాజ్ఞానం ఉన్నవాళ్లు. బాగా చదువుకున్నారు.. భావితరాలను తీర్చిదిద్దే వృత్తుల్లో ఉన్నారు. కానీ వారిలో మూర్ఖత్వం, మూఢ నమ్మకాలు కూడా అపరిమితంగా వర్ధిల్లుతున్నాయి. వారిప్పుడు విశాఖ పిచ్చాస్పత్రిలో ఉన్నారు. చిత్తూరుజిల్లా మదనపల్లెకు చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ.. మూర్ఖ రాక్షసత్వం పిచ్చాసుపత్రిలో నయం అయ్యేదేనా? అనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో ఉంది.
ఇద్దరు కూతుళ్లను చంపేసిన ఆ తల్లిదండ్రులను వైద్యం కోసం మానసిక ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు క్లోజ్డ్ వార్డులలో వేర్వేరుగా ఉంచి, వారిద్దరికీ వైద్యం అందించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తో పాటు మహిళా కాని స్టేబుళ్ల పహరా కూడా ఏర్పాటు చేశారు.
ఆసుపత్రిలో వైద్యం పూర్తయ్యే వరకు మదనపల్లి సబ్ జైల్ నుంచి వచ్చిన సిబ్బంది సైతం వారికి భద్రతగా విశాఖ ఆస్పత్రి వద్దనే ఉండేలా ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి : పిరికితనం చాటుకుంటున్న మోడీ సర్కార్