• About Us
  • Contact Us
  • Our Team
Saturday, September 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

పవన్ ప్రశ్నకు జవాబు చెప్పగలవారున్నారా?

admin by admin
June 3, 2026
0
పవన్ ప్రశ్నకు జవాబు చెప్పగలవారున్నారా?

ఉగ్రవాదం కంటె ప్రాంతీయవాదం దేశానికి ఎంతో ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ సూత్రీకరించారు. నిజానికి ఉగ్రవాదం కంటె ప్రమాదకరమైనవి మతవాదం వంటి అనేకం ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి తనకు జరిగిన పరాభవానికి ఆగ్రహించిన ఆయన.. తెలంగాణ రాజధాని నుంచి.. అక్కడ తన పట్ల నిరసనలు చేసిన వారిని నిలదీశారు. వారి ప్రాంతీయ బుద్ధులను ఎండగట్టారు. తెలంగాణలో కూడా జనసేన పోటీచేసి తీరుతుందని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పగల పార్టీ తెలంగాణలో ఉన్నదా? అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కల్యాణ్ హైదరాబాదులో తన పార్టీ కార్యక్రమం పెట్టదలచుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇందుకు కోపగించిన పవన్ కల్యాణ్ తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి.. దూకుడు ప్రదర్శించిన వారందరినీ కడిగిపారేశారు. సహేతుకమైన ప్రశ్నలు సంధించారు. తాను తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదని.. రాష్ట్రాన్ని చీల్చిన పద్ధతిని మాత్రమే వ్యతిరేకించానని మరోమారు స్పష్టం చేసిన పవన్ కల్యాణ్.. జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పలుకులా అంటూ రెచ్చిపోయారు.

ఇది చాలా మంచి ప్రశ్న. ఒకవైపు రాహుల్ వంటి ఉత్తరాది నాయకుడిని వచ్చి తెలంగాణలో పోటీచేయాల్సిందగా బతిమిలాడే దాస్యధోరణిని ప్రదర్శించే కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణలో స్థానికులనే బరిలోకి దించే జనసేన అస్తిత్వాన్ని ఎలా కాదనగలరు? జనసేన పోటీ వల్ల తమకు రాగల లాభం లేదనుకున్న వారు మాత్రమే వ్యతిరేకిస్తారు. నిజానికి పవన్ చెప్పిన పాయింట్ చాలా కరెక్టు. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ కాగా, పవన్ – జనసేన ఆగమనాన్ని నిరసించే హక్కు వారికి ఎలా ఉంటుంది. తెలంగాణను ఒక స్వతంత్ర రాజ్యంగా భావిస్తున్నట్టుగా.. వారు జనసేన అస్తిత్వాన్ని ప్రశ్నించడం ఎవరికైనా అసహనాన్నే కలిగిస్తుంది. తెలంగాణ వ్యతిరేకిగా పవన్ కల్యాణ్ మీద వారికి ఒక అభిప్రాయం ఉండవచ్చు. అలా ఉన్నా కూడా.. ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేసిన తర్వాత.. తమ వాదనతో ప్రజలను ఒప్పించాలి. ‘పవన్ తెలంగాణ వ్యతిరేకి’ అనే వాదన కరెక్టో.. ‘సామాజిక తెలంగాణను అభిలషించిన నాయకుడు పవన్’ అనే వాదన కరెక్టో ప్రజాక్షేత్రంలోనే తేలుతుంది. ప్రజలే గనుక వద్దనుకుంటే.. జనసే తెలంగాణలో వేసే తొలి అడుగులే చివరి అడుగులు అవుతాయి. అంతే తప్ప ఆయన మీద అసహనం ప్రదర్శించడం, తెలంగాణలోకి రానివ్వం అని బెదిరించడం కరెక్టు కాదు.

నిజానికి పవన్ సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పగలవారు తెలంగాణలో లేరు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్.. పవన్ చెప్పినట్టుగా జాతీయ పార్టీ. ‘ఎవడో సినిమా హీరో ఉంటాడే.. వాడి పేరేంది..’ అంటూ గతంలో పవన్ పేరును ప్రస్తావించడంలోనే ఔద్ధత్యం ప్రదర్శించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, ఆయన గులాబీ దళానికి గతంలో ఆ వెసులుబాటు ఉండేది. తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా రూపు మార్చిన తర్వాత వారు ఆ అర్హతను కూడా కోల్పోయారు. ఆ రకంగా తెలంగాణ ప్రధానంగా జాతీయ పార్టీల అడ్డాగా మారిపోయిన నేపథ్యంలో.. పవన్ ప్రశ్నకు జవాబు చెప్పగల వారు లేరనే చెప్పాలి.

Tags: కాంగ్రెస్జనసేన తెలంగాణతెలంగాణ ప్రభుత్వంపవన్ కల్యాణ్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply