రాష్ట్రంలో గుడివాడ రాజకీయాలు ఎప్పుడ హాట్ టాపిక్ గానే ఉంటాయి. తాజాగా గుడివాడ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు టీడీపీ, వైసీపీ నుంచి గెలసిచిన మంత్రి కొడాలి నానీని ఓడించేందుకు చంద్రబాబునాయుడు కొత్త అస్త్రం బయటకు తీశారు.
గుడివాడలో కమ్మ సామాజికవర్గం తరవాత ప్రభావం చూపే సామాజికవర్గం కాపు. అందుకే వచ్చే ఎన్నికల్లో కాపులకు గుడివాడ సీటు కేటాయించి కొడాలి నాని మెడలు వంచాలని చంద్రబాబు వ్యూహంగా ఉంది
రంగంలోకి వంగవీటి రాధా
అనుకున్నదే తడవుగా కాకుండా అన్నీ సర్వేలు నిర్వహించిన రాబిన్ శర్మ టీం గుడివాడలో బలమైన కాపు నేతకు టీడీపీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబుకు సలహా ఇచ్చిందట. దీంతో ఇక కృష్ణా జిల్లాలో అదీ తూర్పు ప్రాంతంలో బలమైన కాపు నేత అంటే అందరికీ కనిపించేంది వంగవీటి కుటుంబం. గతంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఈ కుటుంబం అనుకోని పరిస్థితుల్లో టీడీపీలోనే చేరాల్సి వచ్చింది.
గతంలో కాంగ్రెస్ పార్టీకి వంగవీటి ఫ్యామిలీ పనిచేసింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో కాపుల ఒత్తిడి మేరకు ఆ పార్టీలో చేరిన వంగవీటి రాధా ఓటమి పాలయ్యారు. తరవాత వైసీపీలో చేరినా టికెట్ హామీ ఇవ్వకపోవడంతో గత ఎన్నికలకు కొద్దిగా ముందుగా టీడీపీలో చేరారు.
గుడివాడ ఖాళీగా ఉంది
విజయవాడ తూర్పులో బాగా ప్రభావం చూపగలిగిన సామాజికవర్గం కాపు. వంగవీటి కుటుంబం అంటే వంగవీటి మోహనరంగా,తరవాత వంగవీటి రాధా ఇక్కడ గెలిచారు. అయితే విజయవాడలో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉండటంతోపాటు విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ రావు 2019లోనూ గెలిచి పట్టు నిరూపించుకున్నారు.
ఇవి కూడా చదవండి :
ఏడుకొండవాడి దర్శనానికి కండీషన్లివే!
Rose Day : రోజాపూల దినోత్సవం కాదు, మరేంటి?
జగన్ సర్కారు పరువుపోయే ఎదురుదెబ్బ!
బీజేపీతో కయ్యానికి సై అంటున్న పవన్ కల్యాణ్
70 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్
ఇక జిల్లాలో మిగిలింది గుడివాడ ఒక్కటే. అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి లేరనే చెప్పాలి. అందుకే గుడివాడలో వంగవీటి రాధా అడుగు పెట్టారని చెప్పాలి. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందనే హామీతో గుడివాడలో చక్రం తిప్పేందుకు వంగవీటి కాపు నేతలతో సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. ఏది ఏమైనా గుడివాడలో కొడాలిని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదుకదా.
.

Discussion about this post