రోజ్ డే అనేది 22 సెప్టెంబరున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ, దాని పేరు చెప్తున్నట్టు, రోజ్ డే కి రోజా పూలకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ రోజ్ డే క్యాన్సర్ పేషెంట్స్‌కి అంకితం.
క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన జబ్బు అనే విషయం మనందరికీ తెలుసు. క్యాన్సర్‌కు చికిత్సగా సర్జరీ, రేడియేషన్ థెరపీ, లేదా కీమో థెరపీ లను వాడుతారు. కానీ, ఈ చికిత్సల వల్ల పేషెంట్లకు, పేషెంట్లను చూసుకునే సంరక్షకులకు మానసిక స్థితి బాగా ఉండక పోవచ్చు. కాబట్టి రోజ్ డే పేషెంట్లను ఆనందింపచేయడానికి జరుపుకుంటారు.
22 సెప్టెంబర్ ~ రోజ్ డే : అసలు ఎందుకు జరుపుకుంటారు?
కెనడాకు చెందిన మెలిండా రోజ్ అనే 12 ఏళ్ళ పాప ఒక అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చాక తను ఇంకా కొన్ని వారాలు మాత్రమే బతకగలదని డాక్టర్లు చెప్పారు. కానీ తన నమ్మకం, ఆశలతో తను 6 నెలలు బ్రతికింది. ఈ ఆరు నెలలలో ఈ పాప ఇతర క్యాన్సర్ పేషెంట్లకు మెయిల్స్, కవితలు, లేఖలు రాసి సానుకూలత చూపింది.
ఈ రోజున క్యాన్సర్ పేషెంట్‌లకు ఇంక వాళ్లని చూసుకునే వాళ్లకు రోజా పువ్వు లేదా ఇతర బహుమతులు ఇచ్చి జరుపుకుంటారు.
ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ మీకు తెలిసి ఉంటే…
వాళ్లతో మామూలుగా ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించచ్చు. కొంతమందిని జబ్బు ఉంది అన్న కారణంతో వారితో ప్రత్యేకంగా ప్రవర్తిస్తే, వాళ్లకి బాధ/కోపం రావచ్చు. వారికి ఒక జబ్బు ఉంది అని మనం మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నట్టు కూడా అనిపించచ్చు.
క్యాన్సర్ కాకుండా వేరే విషయాల గురించి మాట్లాడండి. చికిత్స పొందుతున్న వారికి క్యాన్సర్ గురించి మాట్లాడి బోర్ కొట్టెయచ్చు. కాబట్టి వాళ్లకి నచ్చిన విషయాల గురించి మాట్లాడడం బావుంటుంది.
తరచూ మాట్లాడుతూ ఉండండి. తరచూ మాట్లాడడం కూడా వాళ్లకి మానసికంగా సహాయం చెయ్యచ్చు. వారు ఎప్పుడైనా ఫోన్ ఎత్తలేకపొయినా, లేదా మాట్లాడలేకపోయినా, ఏం ఫరవాలేదు అని చెప్పండి.
ఇవి కూడా చదవండి :
జగన్ సర్కారుకు పరువు పోయే ఎదురుదెబ్బ
బీజేపీతో తెగతెంపులు చేసుకోడానికి పవన్ రెడీ అవుతున్నారా?
మౌనంగా ఉంటే చాలు.. మీరు జ్ఞానం పొందే బాటలో ఉన్నట్టే
వారు బాధను పంచుకోవాలి అని అనుకుంటే వినండి. క్యాన్సర్ గురించి వాళ్లకి మాట్లాడాలని అనిపించకపోయినా, ఏదో ఒక బాధ ఉండచ్చు. ఆ బాధ గురించి మీతో చెప్పుకుంటూంటే వినండి. వినేవారు ఉండడం ఒక పేషెంట్‌కు ఎంతో ముఖ్యం, సహాయం కూడా.
వాళ్లని కలిసే ముందు, లేదా వారికి సహాయం చేసే ముందు వాళ్లని అడగండి. సహాయం వద్దు అన్నారంటే వదిలేయండి. వాళ్ల పనులు వాళ్లే చేసుకోవాలి అని అనిపించచ్చు.
ప్లాన్స్ వేసుకోండి. ఫలానా రోజు మ్యూజియం కి వెళ్దాం… ఫలానా రోజు వాటర్ పార్క్‌కు వెళ్దాం… ఇలాంటివి. ఇలా చేస్తే వాళ్లకి కొద్దిగ ఉత్సాహం కూడా కలగచ్చు.
క్యాన్సర్ వల్ల ఒకరి జీవితం ఎన్నో రకాలుగా మారచ్చు. కానీ వారిలోని ప్రేమ, మానవత్వం, అన్నీ అలానే ఉంటాయి.
ఆదర్శిని అందరికీ రోజ్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటోంది.
Remember: you’re not dying from cancer . . . You’re living with it.
..ఆదర్శిని శ్రీ
twitter.com/sri_adarsini
.

Discussion about this post