• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

గరుడారోహణ కైలాసానికి చేరుస్తుందా?

గరుడవాహనం ఎవరిది? విష్ణుమూర్తిది. ఆ వాహనం ఎక్కితే అది మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుంది? ఖచ్చితంగా వైకుంఠానికే. అందులో తిరుగులేదు. అదే సదరు గరుడవాహనం మనల్ని కైలాసానికి తీసుకువెళితే…!! ఇదేందబ్బా ఇదీ.. బలె చిత్రంగా ఉండాదే అనుకుంటున్నారా?

admin by admin
December 20, 2020
0
గరుడారోహణ కైలాసానికి చేరుస్తుందా?

మన స్వామీజీలు తలుచుకుంటే అలాగే జరుగుతుంది మరి. గరుడవాహనం కైలాసానికి తీసుకువెళుతుంది. లేదా ఇంకెక్కడికైనా తీసుకువెళ్లినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇంతకీ ఏమిటా గరుడవాహనం…? ఏమా కైలాస యాత్ర అని అనుకుంటున్నారా…? అక్కడికే వస్తున్నాం….!

మనదేశంలో గురువులకు, బాబాలకు ఢోకాలేదు. ఏ ఊరిలో చూసినా బాబాలే… ఏ సందులో చూసినా స్వామీజీలే… అయితే కాస్తంత పాపులర్ స్వాముల్లో మనకు బాగా సుపరిచితుడు… తరచూ వివాదాల్లో మనకు తారసపడేవాడు… వార్తల్లో వ్యక్తిగా నిలిచేవాడు… ఒక వ్యక్తి వున్నారు. ఆయన ఎవరో గుర్తుకొచ్చారా… ఆయనపైన అనేకమైన కేసులు వున్నాయి. సినిమా హీరోయిన్లు కూడా ఆయన భక్తులే… ఎవరు భక్తులైనా మొత్తానికి బాబాగారి అసలు రంగు బయటపడింది. ఆయనపై కేసు ఫైల్ అయింది. అయినా గురువుగారు ఏం చిన్నచితక గురువు కాదుకదా… బాగా సంపద కలిగిన భక్తులకు గురువు… సిరిసంపదలు కలిగిన వ్యక్తి… రాజశేఖరన్ గా జన్మించి నిత్యానందగా చలామణిలో వున్న గురువు.

రాసలీలలతో వెలుగులోకి వచ్చి, వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఆయనపై ఎన్నో కేసులు ఫైల్ చేయబడ్డాయి. ఆయన బెయిలుపై బయటికి వచ్చి చక్కగా విదేశాలకు చెక్కేశారు. అంతేకాదు… అక్కడ ఒక చిన్నపాటి దీవిని కొనేసి, అక్కడ తన ఆశ్రమాన్ని స్థాపించి… అక్కడి భక్తులకు జ్ఙానబోధ చేయడానికి సంకల్పించారు. అంతేకాదు… తన ఆశ్రమం… సారీ ఆయన స్థాపించిన ఆ దీవి ఆశ్రమానికి కైలాస అని పేరు. ఆ కైలాసకు రావడానికి కూడా భక్తులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా…?

మీరు గనుక ‘కైలాస’ను సందర్శించాలనుకుంటే అక్కడ మూడు రోజుల పాటు ఉండేందుకు చక్కటి వసతి, భోజన సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్టు ఆయన ఒక వీడియో ద్వారా చెబుతున్నారు. ఈ కైలాస ఈక్వెడార్ కు సమీపంలో ఉంది. అక్కడికి ఎలా వెళ్లాలి… వీసా పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా… వీసా విషయం కూడా స్వామివారే చూసుకుంటారు. అంతేకాదు… ఆ దీవికి వెళ్లడానికి ప్రత్యేకమైన విమానం కూడా ఉందండోయ్… ఆ విమానం పేరు ‘గరుడ’. ఈ విమానం ఎక్కి మనం ఎంచక్కా కైలాసకు వెళ్లిపోవచ్చు.

అరె చక్కగా విమానంలో వెళ్లి మూడు రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటున్నారా… ఇక్కడే అసలు కిటుకు ఉందండోయ్… ఏంటంటే… ఈ విమానం ఆష్ట్రేలియా నుండి మాత్రమే… మిమ్మల్నికైలాసానికి తీసుకువెళుతుంది! మీరు గనుక కైలాసకు వెళ్లాలంటే… ముందుగా చక్కగా ఆస్ట్రేలియాకు వెళ్లండి. అక్కడి నుండి గరుడ మీకోసం వస్తుంది. అన్నట్టు ఈ ప్రయాణం చేయాలంటే… అంటే కైలాస దర్శనం కావాలనుకుంటేమాత్రం మీరు స్వాములవారు సూచించిన ఈ-మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. మరింకేం… గరుడ వాహనం అధిరోహించి… కైలాసాన్ని దర్శించుకోవాలనే కుతూహలం వున్నవారు మెయిల్ పెట్టుకోండి. ముందుగా ఆస్ట్రేలియా చేరుకోండిమరి!

https://www.youtube.com/watch?v=7mAfu8kQ_V8

Tags: garuda to kailasagodman nityanandakailasa near ecuadorromantic swamy nityanandaswamiji romanceswamy nityanandavisa to kailasa
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply