తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పార్లమెంటరీ తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు.
టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ప్రసూతి ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ఇటీవల జరిగిన శిశు మరణాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ…. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వారం రోజుల వ్యవధిలో 14మంది చిన్నారులు మృతి చెందారని ఆరోపించారు.
ఈ మరణాలపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
మంత్రి విడతల రజని, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ మరణాలపై వెంటనే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమం లో భారతి, అనిత, హేమ తదితరులు పాల్గొన్నారు.
.