• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

చెబితే శానా ఉంది – 5 : మురళీధర్ సిగరెట్టు

admin by admin
November 28, 2021
0
చెబితే శానా ఉంది – 5 : మురళీధర్ సిగరెట్టు

మురళీధర్ అప్పట్లో తెలుగు యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు చేస్తుండేవాడు. ఎప్పుడు ఎలా పరిచయమయ్యాడో గుర్తులేదు. కానీ మురళీధర్ ను చూస్తే ముచ్చటేసేది.

గుండెలనిండా బతుకుమీద ఆశ. ఎప్పటికైనా దిల్లీలో పార్లమెంటు సభ్యుడిగా తన గొంతుక వినిపించాలనీ బలంగా కోరుకునేవాడు. అనుకోకుండా ఒకరోజు మురళీధర్ మా ఇంటిముందు ఆటో దిగాడు. వెంటనే నేను పలకరించి ‘ఏమిటి విశేషం, ఇలా వచ్చారు?’ అనడిగాను.

తను వచ్చిన పని చెప్పాడు. మా ఇంటికి దగ్గరలోనే ఒక ప్రభుత్వ అధికారి ఉండేవారు. ఆయన నాకూ పరిచయమే. వాళ్లమ్మాయి, నా కూతురు క్లాస్ మేట్స్. ఆ ప్రభుత్వ అధికారితో పని ఉండి వచ్చిన మురళీధర్ అనుకోకుండా చిరునామా వేటలో మా ఇంటిముందు ఆగాడని అర్థమైంది.

మురళీధర్ ను వెంటబెట్టుకుని ఆ అధికారి ఇంటికి తీసుకువెళ్లాను. తన పని ఏదో వివరించి శాంక్షన్ చేయించమని అడిగాడు. ‘శ్రమ తీసుకుని మీరు ఇంతదూరం రావాలా? ఒక్క ఫోను చేస్తే సరిపోయేదిగదా!’ అన్నాడాయన.

‘పర్సనల్ గా కలిసినట్లు ఉంటుందని వచ్చా’నని మురళీధర్ చెప్పాడు.

ఇద్దరం ఆయన దగ్గర సెలవ తీసుకుని బయటపడ్డాం.

‘రండి, అలా వెళ్లి ఓ దమ్ము లాగుదాం’అన్నాను.

అప్పట్లో సిగరెట్లు ఆబగా పీలుస్తుండేవాణ్ని.

దారంట చాలా విషయాలు చెప్తున్నాడు. ఇంతలో సిగరెట్ బడ్డీ రానే వచ్చింది. తాను రెడ్ విల్స్ తాగుతానన్నాడు. నేనూ మీతోపాటు అదే బ్రాండ్ తాగుతానని చెప్పి రెండు సిగరెట్లు కొని ఒకటి మురళీధర్ చేతిలో పెట్టి స్వయంగా వెలిగించాను.

గుండెల్లోకి గట్టిగా దమ్ములాగి అన్నాడు – ‘‘కొందరి సూటిపోటి మాటలు వింటే చాలా బాధేస్తుందండి. ఒరేయ్! గుడ్డోడా, నీకసలే కళ్లులేవు. పైగా సిగరెట్ ఒకటా’, అంటారండి కటువుగా’’. అని రెండు నిమిషాలు ఆగి మళ్లీ కంటిన్యూ చేశాడు.

‘‘మీరే చెప్పండి. మీకున్న ఆనందాలు ఏవీ నాకు లేవుగదా! మీరు ప్రకృతిలో ప్రతిదాన్ని చూసి ఆనందిస్తారు. నాకా అదృష్టం లేదు. అడుగు తీసి అడుగు వేయాలంటే గండమేకదా! క్షణమొక సవాలుగా ప్రమాదపుటంచుల్లో నడిచే మాలాంటి అంధుల పట్ల ఎందుకంత కసి చెప్పండి. ఈమాత్రం సిగరెట్ ఆనందాన్నీ దక్కనివ్వరా?’’

నా మనసంతా ద్రవించిపోతోంది.

మురళీధర్ గొంతులో బాధ జీర చురకత్తిలా కోస్తోంది.

తేజంలేని ఆ కళ్లలో లోకం పట్ల చూపిన ఏహ్యత గుండెలోతుల్లో గాయం చేసింది.

ఇప్పుడు మురళీధర్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? కాంటాక్ట్ లో లేడు.

ఎప్పుడైనా కనపడితే, అతడితో కలిసి ఓ సిగరెట్ తాగాలని ఉంది.

.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

Tags: chakradharchebithe sana undigovindaraju chakradhargovindaraju chakradhar experiencesjournalist govindaraju chakradharmeeru journalist kavachurachana chakradharview pointwriter's bluesగోవిందరాజు చక్రధర్గోవిందరాజు చక్రధర్ జీవితానుభవాలుచెబితే శానా ఉందివ్యూ పాయింట్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply