తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గం ఏడో మైలు వద్ద చిరుతపులి సంచారం గురువారం రాత్రి కలకలం సృష్టించింది. నడకమార్గంలో వెళుతున్న అదేళ్ల బాలుడిని చిరుత ఎత్తుకెళ్లింది. అంతలోనే దానిని గమనించిన పోలీసులు పెద్దగా కేకలు వేయడంతో.. కంగారు పడిన చిరుత బాలుడిని వదలి వెళ్లిపోయింది.
తిరుమల నడకదారిలో కౄరమృగాల సంచారం తరచుగా పాదయాత్రికులను భయపెడుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పాదయాత్రికులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కౄరమృగాల బెడద ఉండకుండా టీటీడీ ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది.
ఈ క్రమంలో గురువారం రాత్రి చిన్నారి పై చిరుత దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఐదు సంవత్సరాల బాలుడిని చిరుతపులి ఎత్తుకేళ్ళడంతో సమీపంలో విధులో వున్న పోలిసులు పెద్దగా అరిచారు. దీంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్ళింది.
గాయాలపాలైన బాలుడిని పోలిసులు ఆసుపత్రికి తరలించారు.
చిరుత దాడి గురించి తెలియగానే టిటిడి ఇఓ దర్మారెడ్డి ఘటనాస్థలానికి బయలుదేరారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు మరికొందరు అధికారుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు.
తర్వాత, గాయపడిన బాలుడిని తీసుకుని ఈవో ధర్మారెడ్డి స్వయంగా బర్డ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
.