బాల్య వివాహాల నిర్మూలించడంలో స్వచ్చంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీకాళహస్తి డిఎస్పి విశ్వనాద్ అన్నారు.
ప్రగతి సంస్థ ఆద్వర్యంలో బాల్య వివాహాల వలన కలుగు నష్టాలను తెలియచేయు గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా డిఎస్పి విశ్వనాద్ గారు మాట్లాడుతూ చట్ట ప్రకారం పెళ్లి వయస్సు రాని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా లేక పెళ్లి ప్రయత్నాలు చేసిన ఎడల వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొనడం జరుగుతుందని తెలిపారు.
బాల్య వివాహాల వలన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని తెలిపారు.
చిన్న వయసులో బాల్య వివాహాలు చేయడం వలన ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి మండల కోఆర్డినేటర్ ప్రభాకర్, చందమామల కోటయ్య మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
.