అందరూ కొత్త నటులు, కొత్త దర్శకుడు కలిసి చిల్ అవుతున్నారు. చిల్ బ్రో అనే చిత్రాన్ని పూర్తి యూత్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుతున్నారు.
అరుణ సమర్పిస్తున్నఈ చిత్రం అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్‌పై చెంబేటి శ్రీనునిర్మాణంలో రూపొందుతోంది. ‘చిల్ బ్రో’ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. నూతన దర్శకుడు కుంచం శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య శ్రీనివాస్, పవన్ తేజ, రూపిక జంటగా లీడ్ రోల్స్ చేస్తుండడంతో.. ట్రయాంగుల్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. వారితో పాటు ఇందు, నాగి, కుంతి శ్రీనివాస్, ప్రదీప్ రాపర్తి, యాదమ్ రాజు తదితరులు నటిస్తున్నారు.
చిల్ బ్రో టైటిల్ క్యాచీగా అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోందని వారు అంటున్నారు. చిల్ బ్రో ఫస్ట్ లుక్ పోస్టర్‌ని దర్శకులు వి.ఐ ఆనంద్, రమణతేజ విడుదల చేశారు. తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా వారు చిల్ బ్రో ఫస్ట్ లుక్ ని విడుదల చేసి చిత్ర బృందానికి శుభాభినందనలు తెలిపారు.
యూత్ కి కావాల్సిన అన్ని కమర్షీయల్ ఎలిమెంట్స్‌తో ఇది రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని దర్శకుడు కుంచం శంకర్ తెలిపారు. త్వరలోనే ‘చిల్ బ్రో’కి సంబంధించిన మరిన్ని వివరాలు వస్తాయి. కాగా ఈ చిత్రానికి సంగీతాన్ని సురేశ్ బొబ్బిలి అందిస్తున్నారు.
.