తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తన పీఆర్వోగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగిక గటిక విజయకుమార్‌ను తొలగించారు. దీంతో ఆయన తన పీఆర్వో పదవికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లుగా ఎంతో ఉన్నతమైన స్థానంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు.. విజయకుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆ పదవినుంచి తప్పుకున్నారు. అయితే విద్యుత్తు శాఖలోని ఆయన ఉద్యోగం మాత్రం యథాతథంగా ఉంటుందని సమాచారం.
ఎందుకిలా..
ముఖ్యమంత్రి కేసీఆర్ PRO గటిక విజయకుమార్ పార్టీ నాయకులను కూడా లెక్క చేయకుండా.. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అతని వ్యవహార శైలి, అతనిపై కొందరు TRS నాయకులు ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాని పర్యవసానంగానే.. విజయకుమార్‌ను తొలగించడంతో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
విజయ్ కుమార్ తొలగింపునకు గల పూర్తి కారణాలు తెలియకపోయినప్పటికీ.. ప్రగతిభవన్ లో ‘కీలక వికెట్’ పడిందని.. పార్టీ వర్గాలే వ్యాఖ్యానించుకుంటున్నాయి. విజయకుమార్ పై తన దృష్టికి వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ అనంతరమే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ TRANSCO లోనూ ఉన్నత ఉద్యోగంలో కొన సాగుతున్నారు.
.