చిలీలో ప్రజలు ఎన్నుకున్న వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక నియంత ను దేశాధ్యక్షుడిగా కూర్చోబెట్టిన అమెరికా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన చిలీ ప్రజలు మళ్ళీ వామ పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు.
చిలీలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆ దేశ ప్రజలు అలెండ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు.
అయితే అమెరికా జోక్యం చేసుకుని సామ్రాజ్యవాద ధోరణితో చిలీ సైనిక నియంత పినో చెక్ ద్యారా తిరుగుబాటు చేయించి ఆలెండ్ ను కిరాతకం గా హత్య చేయించిందన్నారు.
అనంతరం చిలీ లో కమ్యునిస్టు పార్టీ ని నిషేధించి పీనో చెట్ నిరంకుశ పాలన సాగించారనీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఎన్నికల లో కమ్యూనిష్టులు, సోషలిస్టు కలిసి వామ పక్షాల ప్రతినిధి అయిన గర్బియల్ బోరిక్ ను దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా చిలీ ప్రజానీకానికి భారత కమ్యునిస్టు పార్టీ తరపున అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
.

Discussion about this post