నిరంతరం ప్రజా ఉద్యమాల్లో తీరిక లేకుండా…పాలక పక్షాలపై విమర్శల బాణాలు సంధిస్తూ నిత్యం పత్రికల్లో ఉండే భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఉపాధ్యాయుని మారారు.
సీపీఐ 97వ ఆవిర్బావ దినోత్సం వేడుకలు పురస్కరించుకుని తిరుపతి సమీపంలోని ఓటేరు గంగిరెద్దుల కాలనీలో ఏర్పాటుచేసిన ఉచిత ట్యూషన్ సెంటర్ ను నారాయణ ప్రారంభించారు.
ఆధ్వర్యంలో పిల్లలకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ నారాయణ మాట్లడుతూ… మురికివాడల్లో నివసిస్తున్న పిల్లలు విద్యాభ్యాసంలో రాణించాలన్నారు. మురికివాడల్లో నివసిస్తున్న వారు తమ పిల్లలను చదువులకు దూరం చేసి పనులకు పంపుతున్నారన్నారు.
మరి కొందరు పిల్లల చదువుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ తిరుపతి నగర సమితి చొరవ తీసుకుని మురికి వాడల పిల్లలను సమీకరించి వారికి ఉచితంగా ట్యూషన్ చెప్పడం కోసం ప్రయత్నించడం అభినందనీయమన్నారు.
విద్యార్థులకు కావలసిన పుస్తకాలతో పాటు బట్టలు ఉచితంగా ఇచ్చి ఆదుకోవడం ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, పీఎల్ నరసింహులు , నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, బండి చలపతి , కె. పద్మనాభ రెడ్డి , పి.క్రిష్ణ , పార్టీ ప్రజాసంఘాల నాయకులు కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, జయలక్ష్మి, నదియా, మంజుల, రత్నమ్మ, విజయ, ప్రమీల , బి.లక్ష్మయ్య, సాకంనాగరాజు , నామిని సుబ్రహ్మణ్యం, వై .భాస్కర్ నాయుడు, విజయ భాస్కర్ , రాధమ్మ తదితరులు పాల్గొన్నారు .
.

Discussion about this post